Devi sri prasad: ‘గబ్బర్ సింగ్’ జ్ఞాపకాలు.. అంటూ ఓ వీడియో పోస్ట్ చేసిన దేవిశ్రీ ప్రసాద్

  • ‘గబ్బర్ సింగ్’ చిత్రం విడుదలై నేటికి ఎనిమిదేళ్లు
  • నాడు యూఎస్ లో ఓ కాన్సర్ట్ లో పాల్గొన్నా
  • ఖాకీ చొక్కా ధరించి, తలకు ఎర్ర టవల్ తో ‘గబ్బర్ సింగ్.. ’ పాట పాడా 
Music Director Devi sriprasad posted a Video

ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రం విడుదలై నేటికి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి  సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ స్పందించాడు.

గతంలో అమెరికాలో నిర్వహించిన ఓ మ్యూజిక్ కాన్సర్ట్ లో ‘గబ్బర్ సింగ్.. గబ్బర్ సింగ్’ పాటను తాను పాడిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. ఖాకీ చొక్కా ధరించి, తలకు ఎర్ర టవల్ చుట్టుకుని ఈ పాట పాడానని, కిక్కిరిసిన ఆడిటోరియంలో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందంటూ ఆ వీడియోను దేవిశ్రీ ప్రసాద్ పోస్ట్ చేశాడు.

More Telugu News