వచ్చే ఏడాదిలోనే సెట్స్ పైకి 'ఎఫ్ 3'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వచ్చే ఏడాదిలోనే సెట్స్ పైకి 'ఎఫ్ 3'

F3 Movie
  • 'ఎఫ్ 2'తో భారీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి
  • సీక్వెల్ దిశగా జరుగుతున్న సన్నాహాలు
  • కంటిన్యూ కానున్న 'ఎఫ్ 2' పాత్రలు
దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి గతంలో వచ్చిన 'ఎఫ్ 2' చిత్రం భారీ విజయాన్ని సాధించింది. వెంకటేశ్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించిన ఈ సినిమా, ఆ ఇద్దరి కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. పూర్తి వినోదభరితంగా ప్రేక్షకులను అలరించిన ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి అనిల్ రావిపూడి రంగంలోకి దిగాడు.

ప్రస్తుతం సీక్వెల్ కి సంబంధించిన కథపై కసరత్తు జరుగుతోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనిల్ రావిపూడి భావించాడట. అయితే లాక్ డౌన్ కారణంగా .. వెంకటేశ్ కథానాయకుడిగా చేస్తున్న 'నారప్ప' .. బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాలు వాయిదా పడ్డాయి.

లాక్ డౌన్ తరువాత ఈ సినిమాల షూటింగులు తిరిగి మొదలుకానున్నాయి. అందువలన 'ఎఫ్ 3' సినిమాను వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి తీసుకెళ్లాలనే నిర్ణయానికి అనిల్ రావిపూడి వచ్చాడనేది తాజా సమాచారం. 'ఎఫ్ 2'లో వున్న ఆర్టిస్టులంతా దాదాపుగా ఉంటారని తెలుస్తోంది.
Venkatesh
Varun Tej
Anil Ravipudi

More Telugu News