Pavan kalyan: పవన్ సినిమా కోసం గట్టిగానే ట్రై చేస్తున్న ఇలియానా!

  • పవన్ కల్యాణ్ తాజా చిత్రంగా 'వకీల్ సాబ్'
  • అవకాశం ఇవ్వమంటున్న ఇలియానా
  • ఏ నిర్ణయమూ తీసుకోని 'దిల్' రాజు  
ILeana tries for a chance in Vakeel Saab Movie

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ పేరు వినిపించింది. దాంతో తను ఈ సినిమా చేయడం లేదని ఆమె స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలోనే తెరపైకి ఇలియానా పేరు వచ్చింది. గతంలో పవన్ - ఇలియానా కాంబినేషన్లో 'జల్సా' వచ్చిన సంగతి తెలిసిందే. 'వకీల్ సాబ్' సినిమా కోసం ఇలియానాను ఇంకా ఖరారు చేయలేదట. తను ఈ సినిమా చేస్తానని చెప్పేసి, మేనేజర్ ద్వారా ఆమె సంకేతాలు పంపించినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇలియానాకి ఇక్కడ ఎలాంటి క్రేజ్ లేదు. ఆమె వలన సినిమాకి ఒరిగేది కూడా ఏమీలేదు. అందువలన ఈ సినిమా నిర్మాత 'దిల్' రాజు ఇంకా ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

More Telugu News