'ఎఫ్ 3' సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఎఫ్ 3' సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే!

F3 Movie
  • సూపర్ హిట్ గా నిలిచిన 'ఎఫ్ 2'
  • సీక్వెల్ స్క్రిప్ట్ పై అనిల్ రావిపూడి
  • నవంబర్లో సెట్స్ పైకి వెళ్లే ఆలోచన
అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. సరదాగా .. సందడిగా సాగిపోయే కథల కారణంగానే ఆయన ఆడియన్స్ నుంచి ఎక్కువ మార్కులు కొట్టేస్తున్నాడు .. వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అలా ఆయన నుంచి ఆ మధ్య వచ్చిన 'ఎఫ్ 2' ఏ రేంజ్ లో నవ్వించిందో తెలిసిందే.

ఆ సినిమాకి సీక్వెల్ గా ఆయన 'ఎఫ్ 3' చేయడానికి సిద్ధమవుతున్నాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పైనే ఆయన కసరత్తు చేస్తున్నాడు. ఈ సీక్వెల్లోను వెంకటేశ్ .. వరుణ్ తేజ్ చేయనున్నారు. ప్రస్తుతం 'నారప్ప' సినిమాతో వెంకటేశ్, స్పోర్ట్స్ నేపథ్యంతో కూడిన సినిమాలో వరుణ్ తేజ్ నటిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా అక్టోబర్ నాటికి పూర్తవుతాయి. అందువలన అనిల్ రావిపూడి తన సినిమాను నవంబర్ నుంచి పట్టాలెక్కించే పనిలో వున్నాడని అంటున్నారు.
Venkatesh
Varun Tej
Anil Ravipudi

More Telugu News