సూరజ్ అనే వ్యక్తి నన్ను వేధించాడు: రష్మీ దేశాయ్
- 13 ఏళ్ల క్రితం కెరీర్ ప్రారంభించా
- క్యాస్టింగ్ కౌచ్‌కు ఒప్పుకోకపోతే సినిమా అవకాశాలు రావన్నాడు
- మత్తుమందు కలిసిన కూల్‌డ్రింక్‌ను ఇవ్వబోయాడు
- తప్పించుకుని బయటపడ్డాను
13 ఏళ్ల క్రితం తాను కెరీర్ ప్రారంభించానని వివరించింది. క్యాస్టింగ్ కౌచ్‌కు ఒప్పుకోకపోతే సినిమా అవకాశాలు రావని సూరజ్ అనే వ్యక్తి తనకు చెప్పాడని తెలిపింది. ఓ సారి అతడు తనకు ఫోన్ చేసి సినిమా ఆడిషన్‌లు ఉన్నాయని చెప్పాడని తెలిపింది.
అయితే, అక్కడికి వెళ్లాక అతడు అబద్ధం చెప్పాడని తెలిసిందని వివరించింది. అప్పుడు సూరజ్ మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను ఇవ్వబోయాడని చెప్పింది. దీంతో తాను అక్కడి నుంచి తప్పించుకుని బయటపడ్డానని తెలిపింది. ఆ తర్వాత తన తల్లిని తీసుకుని సూరజ్ దగ్గరికి వెళ్లానని, అతడిని చెంపదెబ్బ కొట్టిందని వివరించింది.