Ramyasri: సినిమా పిచ్చితోనే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను: నటి రమ్యశ్రీ

  • వైజాగ్ లో పుట్టి పెరిగాను
  • మొదటి నుంచి సినిమాల పిచ్చి ఎక్కువే 
  • ఏడు భాషల్లో నటించాను
Ramyasri

శృంగారభరితమైన .. హాస్యభరితమైన పాత్రలను పోషించడం వలన రమ్యశ్రీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " నేను పుట్టి పెరిగింది వైజాగ్ లో. మొదటి నుంచి కూడా సినిమాల పిచ్చి ఎక్కువగానే ఉండేది. అయితే సినిమాకి కూడా మా ఇంట్లో వాళ్లు నన్ను ఒంటరిగా పంపించేవారు కాదు.

ఒకసారి హైదరాబాద్ నుంచి మా ఇంటికి తెలిసిన వాళ్లు వచ్చారు. వాళ్ల ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నాను. 6 నెలల తరువాత ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ కి వెళ్లిపోయాను. ఈ విషయంలో నా స్నేహితురాలు నాకు ఎంతో సహాయం చేసింది. అలా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినప్పుడు నా వయసు 18 ఏళ్లు. అలా హైదరాబాడ్ వచ్చిన నేను, ఏడు భాషల్లో వివిధ రకాల పాత్రలను పోషించాను. దాదాపు అందరు కమెడియన్స్ తో కలిసి నటించాను" అంటూ చెప్పుకొచ్చింది.

More Telugu News