నిన్నటి సాయంత్రాన్ని నా జీవితంలో మర్చిపోలేను: రామ్ చరణ్
- 'మెగాస్టార్ ది లెజెండ్' పుస్తకాన్ని రచించిన సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు
- బుక్ విడుదల కార్యక్రమానికి హాజరైన పలువురు సినీ ప్రముఖులు
- బుక్ ను లాంచ్ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానన్న రామ్ చరణ్
'నిన్నటి సాయంత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది. చిరంజీవిగారి మీద పుస్తకాన్ని రచించిన వినాయకరావుగారికి ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని లాంచ్ చేయడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నా. నాన్న సినీ ప్రయాణంలో కలిసి పయనించిన ఎందరో ప్రముఖులతో కలిసి వేదికను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకాన్ని అభిమానుల ముందుకు తీసుకువచ్చేందుకు పని చేసిన అందరికీ ధన్యవాదాలు' అని రామ్ చరణ్ తెలిపాడు.