Pawan Kalyan: పవన్‌ కల్యాణ్ కొత్త సినిమా ప్రీ లుక్‌ విడుదల.. రేపు సర్‌ప్రైజ్‌ అంటూ ప్రకటన.. ఫ్యాన్స్ ఖుషీ

pawan kalyan new movie prelook
షార్ట్స్‌లో చూడండి
సినీనటుడు పవన్‌ కల్యాణ్ కొత్త సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్ వచ్చేస్తుందని ఇటీవలే సంగీత దర్శకుడు తమన్‌ ట్విట్టర్‌లో తెలిపిన విషయం తెలిసిందే. అయితే, పవన్‌ కల్యాణ్ కొత్త సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌ ఎప్పుడొస్తుందన్న విషయంపై ప్రకటన రాలేదు.

తాజాగా, ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ తమ ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది.  టైటిల్‌ కూడా రేపు ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు లాయర్‌ సాబ్, వకీల్‌ సాబ్‌ అనే టైటిల్‌ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. రేపు సినిమా బృందం ఇచ్చే సర్‌ప్రైజ్‌ కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Tollywood

More Telugu News