అండర్-19 వరల్డ్ కప్ విజేత బంగ్లాదేశ్... ఫైనల్లో టీమిండియా కుర్రాళ్లకు నిరాశ
- ఒత్తిడిని జయించి లక్ష్యాన్ని ఛేదించిన బంగ్లాదేశ్
- తొలిసారిగా ప్రపంచ చాంపియన్లుగా అవతరించిన బంగ్లా టైగర్స్
- రన్నరప్ గా నిలిచిన టీమిండియా జూనియర్ టీమ్
చివర్లో వర్షం పడడంతో బంగ్లా టార్గెట్ ను 46 ఓవర్లలో 170 పరుగులుగా నిర్దేశించారు. 7 వికెట్లు కోల్పోయిన బంగ్లా టైగర్స్ ఈజీగా టార్గెట్ అందుకున్నారు. ముఖ్యంగా, ఎంతో ఒత్తిడిలో కూడా సంయమనం కోల్పోకుండా ఆడిన బంగ్లాదేశ్ కెప్టెన్ అక్బర్ అలీ 43 పరుగులతో అజేయంగా నిలిచాడు. గత వరల్డ్ కప్ చాంపియన్ అయిన భారత్ ఈసారి రన్నరప్ తో సరిపెట్టుకుంది.