హైదరాబాదు సమీపంలో.. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ‘కన్హా శాంతివనం’!
- గ్రేటర్ శివారులోని నందిగామలో నిర్మించిన హార్ట్ ఫుల్ నెస్ సంస్థ
- రేపు బాబా రామ్ దేవ్ చేతుల మీదుగా ప్రారంభం
- ఒకేసారి లక్షమంది ధ్యానం చేసుకోవడానికి వీలు
కన్హా శాంతివనం ప్రారంభోత్సవం సందర్భంగా ఒకేసారి 40 వేల మంది ధ్యానం చేయనున్నారు. హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ మొదటి గైడ్ లాల్జీకి ఈ ధ్యానకేంద్రాన్ని అంకితమివ్వనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాలు మూడు విడతలుగా సాగుతాయని గ్లోబల్ గైడ్ దాజీ తెలిపారు. ఈ నెల 28 నుంచి 30 వరకు తొలి విడత కార్యక్రమాలు, ఫిబ్రవరి 2 నుంచి 4వరకు రెండో విడత, ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు మూడో విడత కార్యక్రమాలు జరుగుతాయన్నారు. రేపటి ప్రారంభోత్సవం కార్యక్రమంలో బాబా రాందేవ్, పలు రాష్ట్రాల గవర్నర్లు పాల్గొననున్నారు. కాగా, ఫిబ్రవరి 2న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, 7న సామాజిక కార్యకర్త అన్నా హజారే హాజరు కానున్నారని దాజీ తెలిపారు.