రాజారెడ్డి లాంటి ఉత్తమోత్తమ వ్యక్తిని చంద్రబాబు విమర్శిస్తారా?: వైసీపీ నేత భూమన ఫైర్
- జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూస్తారా?
- అందుకోసం జగన్ తాత రాజారెడ్డి గురించి ప్రస్తావిస్తారా?
- ఏపీ అసెంబ్లీలో భూమన ఆగ్రహం
‘రాజారెడ్డి లాంటి ఉత్తమోత్తమమైన వ్యక్తి చాలా అరుదుగా రాజకీయాల్లో ఉంటారు. ఆయనతో ఇరవై మూడు సంవత్సరాలు ఏ ఒక్కరూ లేనంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా చెబుతున్నాను. కమ్యూనిస్టు నాయకుడు, నిజాయతీగా నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచిన ఎద్దుల ఈశ్వరరెడ్డి గారికి పులివెందుల నుంచి ఏజెంట్ గా 1977 వరకు రాజారెడ్డి ఉన్నారు. కమ్యూనిస్టు నాయకుడు, ప్రముఖ పాత్రికేయుడు, గొప్ప దార్శనికుడు గజ్జెల మల్లారెడ్డిగారికి అత్యంత ప్రాణసఖుడు రాజారెడ్డి గారు. ఇలాంటి గొప్ప వ్యక్తిని గురించి నీచంగా మాట్లాడటం చంద్రబాబునాయుడుకే తగింది’ అని విమర్శించారు.