సార్.. నాది కూడా సేమ్ ఫీలింగ్: రాజమౌళి
- 'ఆర్ఆర్ఆర్' లో అజయ్ దేవగణ్
- అజయ్ పై సన్నివేశాలు చిత్రీకరించిన రాజమౌళి
- సంతోషం వ్యక్తం చేసిన బాలీవుడ్ హీరో
2012 నుంచి రాజమౌళి సర్ తో అనేక విధాలుగా ప్రయాణిస్తున్నానని, ఇప్పుడు ఆయన దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' లో నటిస్తుండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. దీనికి రాజమౌళి ఎంతో వినమ్రంగా బదులిచ్చారు. "సార్.. నేను కూడా మీలాగే సంతోషంగా ఫీలవుతున్నాను. తొలిరోజు షూటింగ్ అద్భుతంగా గడిచిపోయింది" అంటూ ట్వీట్ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.