రోహిత్ శర్మ పేరుతో హైదరాబాదు సమీపంలో క్రికెట్ స్టేడియం
- హైదరాబాద్ శివార్లలో నిర్మాణం
- శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమంలో స్టేడియం
- సతీసమేతంగా విచ్చేసిన రోహిత్ శర్మ
ఇక్కడి కన్హ గ్రామ శివార్లలోని శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమంలో ఈ క్రికెట్ స్టేడియం నిర్మాణం జరుపుకుంటోంది. నిర్మాణ పనులను రోహిత్ శర్మ స్వయంగా పరిశీలించాడు. దీనిపై రామచంద్ర మిషన్ కు చెందిన కమలేష్ పటేల్ మాట్లాడుతూ, యువతకు స్ఫూర్తినిచ్చే వ్యక్తుల్లో రోహిత్ శర్మ ఒకడని, అందుకే అతని పేరును క్రికెట్ స్టేడియంకు పెట్టామని వివరించారు. తనకు లభించిన గౌరవం పట్ల రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. త్వరలో ఇక్కడికి ఇతర టీమిండియా క్రికెటర్లను కూడా తీసుకువస్తానని తెలిపాడు.