ఢిల్లీలో స్నేహితుడితో కలిసి చర్చికి వెళ్లిన తెలుగు లేడీ డాక్టర్ అదృశ్యం... భర్త ఫిర్యాదు!
- కర్నూలులో కలిసి చదువుకున్న హిమబిందు, శ్రీధర్, దిలీప్
- పెళ్లి చేసుకుని ఢిల్లీలో సెటిలైన హిమబిందు, శ్రీధర్
- ఇంటర్వ్యూకి వెళ్లి వస్తూ శ్రీధర్ దంపతుల ఇంట్లో దిగిన దిలీప్
అయితే, ఓ ఇంటర్వ్యూ కోసం పుదుచ్చేరి వెళ్లిన దిలీప్ సత్య తిరుగుప్రయాణంలో తన స్నేహితులైన హిమబిందు, శ్రీధర్ దంపతుల ఇంట్లో దిగాడు. క్రిస్మస్ సందర్భంగా దిలీప్ సత్యతో చర్చికి వెళ్లి వస్తానని బయల్దేరిన హిమబిందు మళ్లీ ఇంటికి రాలేదు. ఆమెతో వెళ్లిన దిలీప్ సత్య ఆచూకీ కూడా తెలియరాలేదు. ఇద్దరి ఫోన్లు స్విచాఫ్ అయ్యాయి. దాంతో హిమబిందు భర్త డాక్టర్ శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై చిన్న క్లూ కూడా దొరక్కపోవడంతో ఈ కేసు పోలీసులకు ఓ పెద్ద సవాల్ గా మారింది.