విజయసారెడ్డిగారూ... మీకు, జగన్ గారికి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా: బుద్ధా వెంకన్న
- జగన్ శ్మశానంలో కూర్చొని పాలిస్తున్నారా?
- జగన్ కు పాలన చేతకాదని మీరే ఒప్పుకున్నారు
- బడుగు, బలహీనవర్గాల రైతులు ధనవంతులు కాకూడదా?
అమరావతిని రియలెస్టేట్ వెంచర్ లా తయారు చేశారని మీరు మాట్లాడటం దారుణం విజయసాయిరెడ్డిగారు అని బుద్ధా వెంకన్న అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు చెందిన రైతులు ధనవంతులు కాకూడదా? అని ప్రశ్నించారు. ఇలాంటివారి కోసమే చంద్రబాబు ప్రపంచమంతా తిరిగి అమరావతికి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారని తెలిపారు. జగన్ గారిలా విదేశాల్లో సూట్ కేసు కంపెనీలను ఏర్పాటు చేసుకుని, సొంత కంపెనీల్లోకి డబ్బు మళ్లించి ప్రజలను దోచుకోలేదని మీకు, జగన్ కు గుర్తు చేస్తున్నానని చెప్పారు.