గంటలో లొంగిపోతా.. కానీ ఒక షరతు: చింతాడ రవి

I will surrender in an hour but one condition Chintada Ravi Kumar ultimatum to police
  • మూడు రోజులుగా పరారీలో ఉన్న చింతాడ రవి
  • తాను శ్రీకాకుళంలోనే ఉన్నానని, పారిపోలేదంటూ వీడియో విడుదల
  • అనుచరులపై కేసులు ఎత్తివేస్తే గంటలో లొంగిపోతానని షరతు
  • తాను జగన్ శిష్యుడినని, ఎన్ని కేసులు పెట్టినా భయపడనని వ్యాఖ్య
ఎస్సై ప్రవళికపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ గత మూడు రోజులుగా పరారీలో ఉన్న ఆమదాలవలస వైఎస్సార్‌సీపీ నేత చింతాడ రవికుమార్ ఆదివారం ఒక వీడియోను విడుదల చేశారు. ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన, తాను ఎక్కడికీ పారిపోలేదని, శ్రీకాకుళంలోనే ఉన్నానని ఈ వీడియో ద్వారా స్పష్టం చేశారు.

"నా అనుచరులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తే గంటలోపు నేనే వచ్చి లొంగిపోతాను. ఈ ఘటనతో ఏమాత్రం సంబంధం లేని 20 మంది అమాయకులపై అక్రమంగా కేసులు బనాయించారు. నేను వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శిష్యుడిని, ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు" అని రవికుమార్ పేర్కొన్నారు. తాను న్యాయస్థానం ద్వారానే ఈ కేసులను ఎదుర్కొంటానని, పారిపోయే వ్యక్తిని కాదని ఆయన తేల్చి చెప్పారు.
Advertisement
Chintada Ravi Kumar
SI Pravalika
YSRCP Leader
Srikakulam Police
Amadalavalasa
Andhra Pradesh Politics

More Telugu News