పప్పు యాదవ్ ప్రెస్‌మీట్‌లో రభస.. చెప్పు విసిరి, కత్తితో దాడికి యత్నం

Pappu Yadav press meet chaos shoe thrown and knife attack attempt
  • పప్పు యాదవ్ పై చెప్పు విసిరిన ఆగంతకుడు
  • కత్తితో మరో వ్యక్తి దాడికి యత్నించాడని ఆరోపణలు
  • నిందితుడిని తన అనుచరుల నుంచి కాపాడిన పప్పు య ాదవ్
  • తన తలకు రూ.51 లక్షల వెల కట్టారన్న పప్పు యాదవ్ 
బిహార్‌లోని పూర్ణియా స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్‌పై దాడి జరిగింది. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పప్పు యాదవ్ మీడియాతో మాట్లాడుతుండగా, ఓ వ్యక్తి ఆయనపైకి చెప్పు విసరడంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన సుమిత్ అనే వ్యక్తి మీడియా సమావేశంలో పప్పు యాదవ్‌పైకి చెప్పు విసిరాడు. అదే సమయంలో మరో వ్యక్తి కత్తితో దాడికి యత్నించగా, అక్కడున్న వారు అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. పప్పు యాదవ్ మద్దతుదారులు సుమిత్‌పై దాడికి దిగగా, ఎంపీ స్వయంగా జోక్యం చేసుకుని అతడిని కాపాడారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

సాధువుల పట్ల పప్పు యాదవ్ అనుచితంగా మాట్లాడినందుకే తాను ఈ చర్యకు పాల్పడినట్లు సుమిత్ తెలిపినట్లు సమాచారం. అయితే, అయోధ్య రామ మందిర విరాళాల విషయంలో అవకతవకలు జరిగాయని తాను ఆరోపించినప్పటి నుంచే తనకు బెదిరింపులు వస్తున్నాయని పప్పు యాదవ్ పేర్కొన్నారు. తన తలపై రూ.51 లక్షల రివార్డు ప్రకటించారని ఆయన ఆరోపించారు. కాగా, రామ మందిర విరాళాల అంశంపై పార్లమెంట్ ఆవరణలో స్కిట్ ప్రదర్శించినందుకు గాను పప్పు యాదవ్, రాహుల్ గాంధీ తదితరులపై ఒకరోజు ముందే పోలీసులకు ఫిర్యాదు అందడం గమనార్హం.                                
Advertisement
Pappu Yadav
Rajesh Ranjan
Purnia MP attack
Delhi press meet chaos
Ram Mandir donation controversy
Shoe thrown at Pappu Yadav

More Telugu News