దిశ చట్టం అమలు చేయకముందే విమర్శలు చేస్తారా?: టీడీపీ సభ్యులపై హోంమంత్రి అసహనం
- దిశ చట్టం తీసుకువస్తున్న ఏపీ ప్రభుత్వం
- టీడీపీ సభ్యులు దుష్ప్రచారం చేస్తున్నారన్న సుచరిత
- తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడి
తామింకా చట్టం అమలు చేయకముందే, అందులో లోపాలున్నాయనడం సరికాదని, టీడీపీ సభ్యులు తమపై బురదజల్లేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని సుచరిత ఉద్ఘాటించారు. మహిళలపై నేరాలకు కేసులు నమోదు చేయడంలేదని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.