ప్రియాంక విషయంలో పోలీసులదే తప్పు.. మంత్రుల మాటలు బాధాకరం: డా.లక్ష్మణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రియాంక విషయంలో పోలీసులదే తప్పు.. మంత్రుల మాటలు బాధాకరం: డా.లక్ష్మణ్

  • స్టేషన్ కు వచ్చిన ప్రియాంక తల్లి, చెల్లెలు పట్ల పోలీసులు సరిగా స్పందించలేదు
  • కేసు తమ పరిధిలోకి రాదని చెప్పడం దారుణం
  • పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చేలా మంత్రులు మాట్లాడుతున్నారు
ప్రియాంకరెడ్డి ఇంటికి రాలేదని, తమకు చాలా భయంగా ఉందంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆమె తల్లి, చెల్లెలు పట్ల పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. ఈ కేసు తమ స్టేషన్ పరిధిలోకి రాదని చెప్పడం దారుణమని చెప్పారు. ఆందోళనతో పీఎస్ కు వచ్చిన వారితో చులకనగా మాట్లాడటం క్షమించరాని నేరమని అన్నారు.

ఈ ఘటనపై రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్న తీరు సరిగా లేదని లక్షణ్ అన్నారు. చెల్లెలితో మట్లాడకుండా 100కి ఫోన్ చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని మంత్రులు అంటున్నారని... పోలీసుల నిర్లక్ష్యంపై వారెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సదరు పోలీసు అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యం వరదలై పారుతోందని, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని... వీటి వల్ల నేరాలు పెరుగుతున్నాయని అన్నారు.
Disha
Murder
Lakshman
BJP

More Telugu News