Sri Vishnu: యువ కథానాయకుడికి జోడీగా కాజల్?

షార్ట్స్‌లో చూడండి
 ప్రస్తుతం కాజల్ 'ఇండియన్ 2' సినిమా షూటింగుతో బిజీగా వుంది. ఈ సినిమాలో ఆమె కమల్ సరసన కనిపించనుంది. ఆ తరువాత ఆమె ఓ యువ కథానాయకుడికి జోడీగా కనిపించే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు .. శ్రీవిష్ణు. అవును, శ్రీవిష్ణు హీరోగా లక్ష్య ప్రొడక్షన్స్ వారు ఒక సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా ప్రదీప్ వర్మ పరిచయం కానున్నాడు.

పోలీస్ డ్రామా నేపథ్యంలో ఈ కథ నడుస్తుందట. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కాజల్ ను సంప్రదిస్తున్నారు. కాజల్ అంగీకరిస్తే అది ఈ సినిమాకి కలిసొచ్చే అంశం అవుతుందని భావిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ వంటి హీరోల జోడీగా కనిపించడానికి సైతం ఆసక్తిని చూపుతున్న కాజల్, శ్రీవిష్ణు జోడీగా అలరించడానికి అంగీకరించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Go Back to Shorts
Sri Vishnu
Kajal

More Telugu News