'ప్రతిరోజూ పండగే' నుంచి 'ఓ బావా' సాంగ్ ప్రోమో రిలీజ్

  • సాయిధరమ్ తేజ్ హీరోగా 'ప్రతిరోజూ పండగే' చిత్రం
  • చిత్రానికి తమన్ బాణీలు
  • నవంబరు 18న పూర్తి పాట రిలీజ్
యంగ్ హీరో సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా 'ఓ బావా' అనే సాంగ్ ప్రోమో రిలీజైంది. నవంబరు 18న పూర్తి పాట వస్తుందని ప్రోమోలో పేర్కొన్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, నవంబరు 16న తమన్ పుట్టినరోజు కావడంతో చిత్రయూనిట్ తరఫున హీరో సాయిధరమ్ తేజ్ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశాడు.
Go Back to Shorts
Pratiroju Pandage
Saidharam Tej
Maruti
Tollywood

More Telugu News