Galla Jaydev: గల్లా జయదేవ్ చిన్న కొడుకు సిద్ధార్థ కూడా సినీ రంగంలోకే...!

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ తన పెద్ద కుమారుడు అశోక్ గల్లాను చిత్ర రంగానికి పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం అశోక్ గల్లా నటిస్తున్న చిత్రం ముహూర్తపు కార్యక్రమం జరిగింది. అయితే, గల్లా జయదేవ్ చిన్న కొడుకు సిద్ధార్థ కూడా త్వరలోనే వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని సిద్ధార్థే స్వయంగా వెల్లడించాడు. తన సోదరుడిలా సొంత సంస్థలో కాకుండా బయటి సంస్థ నిర్మించే చిత్రంతో అరంగేట్రం చేస్తున్నానని తెలిపాడు. ఓ అందమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పాడు. తమకు బాల్యం నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టం అని, అందుకే సినిమాను కెరీర్ గా ఎంచుకున్నామని వివరించాడు.
Go Back to Shorts
Galla Jaydev
Ashok Galla
Galla Sidhartha
Tollywood

More Telugu News