పాప పుడితే సుబ్బమ్మ.. బాబు పుడితే గోపాలరావు, సుబ్బినాయుడు పేర్లే పెడుతోన్న గ్రామస్థులు
- తూర్పు గోదావరి జిల్లా జోగింపేట గ్రామంలో గ్రామస్థుల ఆచారం
- గ్రామ దేవత సుబ్బమ్మ పేరంటాలు పేరిట పేరు
- వందల ఏళ్ల నుంచి ఈ గ్రామంలో తొలి సంతానానికి ఇవే పేర్లు
పూర్తి వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలోని జోగింపేట గ్రామంలో సుమారు 250 కుటుంబాలు ఉన్నాయి. ఆ గ్రామ దేవత సుబ్బమ్మ పేరంటాలు. దీంతో ఇక్కడి ఆచారాలు ఇలా కొనసాగుతున్నాయి. వందల ఏళ్ల నుంచి ఈ గ్రామంలో ఏ కుటుంబంలోనైనా తొలి సంతానానికి ఇలా గ్రామ దేవత పేరు కలిసొచ్చేలా పేర్లు పెడుతున్నారు.