భారీ చారిత్రక చిత్రం కోసం థాయ్ లాండ్ కి మణిరత్నం టీమ్
- భారీ చారిత్రక చిత్రంగా 'పొన్నియిన్ సెల్వన్'
- డిసెంబర్ 2వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్
- థాయ్ లాండ్ లో తొలి షెడ్యూల్
చోళరాజుల కాలంనాటి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. తమిళంలో ఈ సినిమాకి 'పొన్నియిన్ సెల్వన్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. విక్రమ్ .. జయం రవి .. కార్తీ .. మోహన్ బాబు .. ఐశ్వర్య రాయ్ .. కీర్తి సురేశ్ వంటి తారలను ఇప్పటికే ఎంపిక చేేశారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ను థాయ్ లాండ్ లో ప్లాన్ చేశారు. డిసెంబర్ 2వ వారం నుంచి అక్కడ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. షూటింగుకు వారం ముందుగానే ఈ సినిమా టీమ్ అక్కడికి చేరుకోనుంది.