Nayanatara: మురుగదాస్ కి ముందుగానే తేల్చి చెప్పేసిన నయనతార

షార్ట్స్‌లో చూడండి
మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా 'దర్బార్' సినిమా రూపొందింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాను సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా నయనతార కనిపించనుంది. ఈ సినిమా గురించిన ఒక టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది.

గతంలో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'గజిని' సినిమాలో నయనతార నటించింది. ఆ పాత్రను గురించి తనకి ముందుగా చెప్పింది వేరు .. తెరపై కనిపించింది వేరు అని ఆ సమయంలో నయనతార అసంతృప్తిని వ్యక్తం చేసింది. అంతేకాదు, ఆ సినిమాలో తను చేసిన పాత్ర .. తన కెరియర్లోనే చెత్త పాత్ర అని ఒక ఇంటర్వ్యూలోను చెప్పింది. అందువల్లనే 'దర్బార్'లో తన పాత్ర గురించి తనకి చెప్పిన ప్రతిదీ తెరపై కనిపించాలని ఆమె ముందుగానే మురుగదాస్ కి చెప్పిందట. ఆయన ఓకేనన్న తరువాతనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు.
Go Back to Shorts
Nayanatara
Muruga Doss

More Telugu News