కరీనా కపూర్ కు అరుదైన అవకాశం కల్పించిన ఐసీసీ
- మెల్బోర్న్ లో ఐసీసీ కార్యక్రమం
- టి20 వరల్డ్ కప్ ట్రోఫీలను ఆవిష్కరించిన కరీనా
- ఐసీసీ ఈవెంట్ లో పాల్గొనడం పట్ల హర్షం
తన మామయ్య మన్సూర్ అలీఖాన్ పటౌడీ కూడా క్రికెటరే అని తెలిపిన కరీనా, టి20 వరల్డ్ కప్ ట్రోఫీలను ఆవిష్కరించడం తనకు గర్వకారణమని పేర్కొంది. పలు దేశాల జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా క్రికెటర్లను అభినందిస్తున్నానని, అంతర్జాతీయ వేదికలపై మహిళలను సమున్నతస్థాయిలో చూడడం సంతోషం కలిగిస్తోందని అన్నారు.