అల్పపీడనం వాయుగుండం అవుతోంది... మరిన్ని రోజులు భారీ వర్షాలు!
- రేపటికి వాయుగుండంగా మారే అవకాశం
- ఒకటి, రెండు చోట్ల కుంభవృష్టికి చాన్స్
- హెచ్చరించిన వాతావరణ శాఖ అధికారులు
కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, వాగులు, వంకలు, చిన్న నదుల్లోకి అకస్మాత్తుగా భారీ వర్షపు నీరు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలకూ అవకాశముందన్నారు. కాగా, అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లాలో గత రాత్రి నుంచే ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ప్రత్తిపాడు, కాకుమాను, పెదనందిపాడు, వట్టి చెరుకూరు మండలాల్లో కుంభవృష్టి కురిసింది. దీంతో పత్తి, మిరప పొలాల్లోకి వర్షపు నీరు చేరగా, రైతుల్లో ఆందోళన మొదలైంది.