Sri Vishnu: రెడీ అవుతున్న 'తిప్పరా మీసం'

షార్ట్స్‌లో చూడండి
మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంతకుముందు ఆయన చేసిన 'బ్రోచేవారెవరురా' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నటుడిగా శ్రీవిష్ణులోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. దాంతో ఆయన తదుపరి సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

శ్రీవిష్ణు తాజా చిత్రంగా 'తిప్పరా మీసం' నిర్మితమైంది. శ్రీవిష్ణు డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న ఈ సినిమాకి కృష్ణ విజయ్ దర్శకుడిగా వ్యవహరించాడు. శ్రీవిష్ణు జోడీగా నిక్కీ తంబోలి నటించిన ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందించాడు. నవంబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చుపెడుతుందని శ్రీవిష్ణు బలంగా చెబుతున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.
Go Back to Shorts
Sri Vishnu
Nikky

More Telugu News