Tenali: తెనాలి లాడ్జ్ లో ఆత్మహత్య చేసుకున్న అమరావతి యువకుడు, కృష్ణా జిల్లా యువతి!

  • గోల్డ్ స్టార్ లాడ్జ్ లో రూమ్ తీసుకున్న సాగర్
  • అదే రూమ్ కు వచ్చిన తేజస్వి
  • ఇరువురూ ఆత్మహత్య
తెనాలికి వచ్చి ఓ లాడ్జ్ లో దిగిన యువతీ యువకులు ఆత్మహత్యకు పాల్పడటంతో, ఇందుకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే, ఇక్కడి గోల్డ్ స్టార్ లాడ్జిలో అమరావతి మండలం జూపూడి గ్రామానికి చెందిన ఏకుల సాగర్ బాబు (24) వచ్చి రూమ్ తీసుకున్నాడు.

తర్వాత అదే రూమ్ కు కృష్ణా జిల్లా పునాదిపాడు గ్రామానికి చెందిన తేజస్వి (23) కూడా వచ్చింది. సాగర్ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోగా, తేజస్వి తన చేతి నరాలను కోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. లాడ్జి సిబ్బంది ఎంతగా తలుపులు కొట్టినా వీరు తెరవకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి, తలుపులు పగులగొట్టగా, ఇరువురి మృతదేహాలూ కనిపించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, కేసును విచారిస్తున్నారు.
Tenali
Sucide
Sagar
Tejaswi
Amaravati

More Telugu News