Punarnavi: త్వరలో అన్ని విషయాలు చెబుతా: పునర్నవి

షార్ట్స్‌లో చూడండి
బిగ్ బాస్-3 రియాల్టీ షోలో 11 వారాల పాటు కొనసాగి, తాజాగా ఎలిమినేట్ అయిన టాలీవుడ్ నటి పునర్నవి భూపాలం మళ్లీ రియల్ లైఫ్ లోకి ఎంటరైంది. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె స్నేహం అనేక ఊహాగానాలకు తావిచ్చినా, ఎన్ని ప్రశ్నలు ఎదురైనా హుందాగా వ్యవహరించిన ఆమె తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక, చాలారోజుల తర్వాత బాహ్య ప్రపంచంలోకి వచ్చిన పునర్నవి ఇన్ స్టాగ్రామ్ లో స్పందించింది.

"మళ్లీ మన లోకంలోకి వచ్చేశాను. బిగ్ బాస్ ఇంట్లో ఇదో అద్భుత ప్రయాణం. ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాను. ప్రతిక్షణం ఆస్వాదించాలన్నదే నా అభిమతం. నా ప్రియమైన ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు. మీరు లేకుండా నేను లేను. నేను ఎలా ఉన్నా ఆదరించినందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. త్వరలోనే కోలుకుని అన్ని విషయాలతో లైవ్ లోకి వస్తా" అంటూ తన పోస్టులో పేర్కొంది.


Go Back to Shorts
Punarnavi
BiggBoss-3
Andhra Pradesh
Telangana

More Telugu News