Chiranjeevi: దేవుడు ఇంత చిన్నచూపు చూస్తాడని అనుకోలేదు: వేణుమాధవ్ మృతిపై చిరంజీవి స్పందన

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ హాస్యనటుడు వేణుమాధవ్ తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. వేణుమాధవ్ మృతి పట్ల అగ్రనటుడు చిరంజీవి స్పందించారు. చిన్నవయసులోనే వేణును దూరం చేసి దేవుడు ఇంత చిన్నచూపు చూస్తాడని అనుకోలేదని, హాస్యకుటుంబానికి తీరనిలోటు చేశాడని అన్నారు.

వేణు వంటి ప్రతిభావంతుడైన నటుడు టాలీవుడ్ కు దొరకడం అదృష్టం అనుకున్నామని, ఇంతలోనే ఆ నవ్వును దేవుడు చెరిపేస్తాడని ఊహించలేకపోయామని విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా వేణుమాధవ్ మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని, తామిద్దరం షూటింగ్ లో కంటే బయటే బాగా ఎంజాయ్ చేసేవాళ్లమని తెలిపారు. హైదరాబాద్ లోని ఫిలించాంబర్ లో నివాళులు అర్పించిన అనంతరం చిరు ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Chiranjeevi
Venu Madhav
Tollywood

More Telugu News