Chandrababu: ఆ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.. ఇప్పుడు మరో చెత్త సినిమా వదిలారు: విజయసాయిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబును ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. గతంలో తీయించుకున్న 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు' చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని తెలిపారు. ఎలక్షన్లలో ఘోర పరాజయం తర్వాత... ఇప్పుడు మళ్లీ 'ఛలో ఆత్మకూరు' అనే చెత్త సినిమాను వదిలారంటూ ఎద్దేవా చేశారు. సంక్షేమ కార్యక్రమాలతో ముఖ్యమంత్రి జగన్ దూసుకుపోతుంటే... ఏడుపుగొండి చర్యలతో చంద్రబాబు మరింత పతనమవుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, టీడీపీ నేతలపై విజయసాయిరెడ్డి ప్రతి రోజు ట్విట్టర్ లో విమర్శలు మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Chandrababu
Jagan
Vijayasai Reddy
Telugudesam
YSRCP

More Telugu News