సర్టిఫికెట్లు లేకున్నా అప్లై చేసుకోవచ్చు.. తెలంగాణలో కొత్త పింఛన్ దరఖాస్తుదారులకు ఉపశమనం
- ఆన్‌లైన్, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం
- వెరిఫికేషన్ సమయంలో మాత్రం సర్టిఫికెట్లు తప్పనిసరి
- సర్టిఫికెట్ల జాప్యంతో అర్హులకు ఇబ్బందులు
- దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఊరట
- కొత్త పింఛన్లకు సెప్టెంబర్ 15 చివరి తేదీ
కొత్త పింఛన్ కోసం ఎదురుచూస్తున్న అర్హులకు తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చింది. దరఖాస్తు సమయంలో ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేకపోయినా.. వాటి కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ముందుగా కొత్త పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం, సెర్ప్ వెల్లడించింది. దీంతో సర్టిఫికెట్లు రావడంలో జాప్యం కారణంగా దరఖాస్తు గడువు మిస్ అవుతుందేమోనని ఆందోళన చెందుతున్న వారికి ఉపశమనం లభించింది.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దివ్యాంగుల సర్టిఫికెట్లు, కులం, ఆదాయం, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఆలస్యం జరుగుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ, తహసీల్దార్ కార్యాలయాలు, సదరం క్యాంపుల నుంచి సర్టిఫికెట్లు పొందేందుకు సమయం పడుతుండటంతో అర్హులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల కోసం ఆగకుండా ముందుగా ఆన్‌లైన్‌లో లేదా నిర్దేశిత మీసేవా కేంద్రాల్లో కొత్త పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సెర్ప్ స్పష్టం చేసింది. అయితే ఇక్కడే ఓ కీలక నిబంధన ఉంది.
వెరిఫికేషన్‌లో మాత్రం తప్పనిసరి
దరఖాస్తు చేసే సమయంలో ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా ఫర్వాలేదు. కానీ అధికారులు దరఖాస్తును పరిశీలించే సమయంలో మాత్రం సంబంధిత సర్టిఫికెట్లను తప్పనిసరిగా సమర్పించాలి. కాబట్టి దరఖాస్తు చేసుకున్న తర్వాత అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
సెప్టెంబర్ 15 వరకు అవకాశం
కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 15 చివరి తేదీగా అధికారులు ప్రకటించారు. అర్హత ఉన్న వారు ఇంకా దరఖాస్తు చేయకపోతే ఎలాంటి ఆలస్యం చేయకుండా గడువులోపు అప్లై చేసుకోవాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. దీంతో అర్హులైన పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.