Nara Lokesh: క్రీడాకారిణికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నారా లోకేశ్!

షార్ట్స్‌లో చూడండి
ఇటీవలే ఏపీ పవర్ లిఫ్టర్ చంద్రికకు ఎన్నారై, యూకే టీడీపీ విభాగాలు సేకరించిన రూ.2.5 లక్షల విరాళాన్ని అందించిన టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తాజాగా మరోసారి ఆర్థిక సాయం చేశారు. కొన్నివారాల కిందట ప్రవాసాంధ్రుల విరాళాల చెక్ ను అందిస్తూ, భవిష్యత్తులో ఆమెను టీడీపీ అన్ని విధాలా ఆదుకుంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ తాజాగా రూ.2.5 లక్షల చెక్ ను చంద్రికకు అందించారు. మొత్తమ్మీద చంద్రికకు టీడీపీ నుంచి రూ.5 లక్షల మేర ఆర్థికసాయం అందింది.

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన చంద్రిక పేద కుటుంబంలో పుట్టినా, పవర్ లిఫ్టింగ్ పై మక్కువతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, ఓవైపు చదువుకుంటూనే పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటోంది. ప్రస్తుతం చంద్రిక కెనడాలో నిర్వహించే పవర్ లిఫ్టింగ్ టోర్నీలో పాల్గొంటోంది.  ఆమెకు చెక్ అందించిన నారా లోకేశ్ మాట్లాడుతూ, దేశం గర్వించేలా విజయం సాధించాలని ఆకాంక్షించారు. మున్ముందు కూడా టీడీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
Go Back to Shorts
Nara Lokesh
Chandrika
Powerlifter

More Telugu News