సీఎం గారూ, మీ వెనుక ఏం జరుగుతోందో తెలుసుకోండి: వర్ల రామయ్య
- పొనుగుపాడులో రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణం
- వైసీపీ కార్యకర్తలే ఆ గోడ కట్టారంటూ టీడీపీ ఆరోపణ
- ట్విట్టర్ లో స్పందించిన వర్ల రామయ్య
'మీ సలహాదారులు ఇస్తున్న సలహాలు సరైనవేనా?' అనే విషయం సమీక్షించుకోవాలని సూచించారు. పొనుగుపాడులో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన గోడను ఇంతవరకు తొలగించలేదని, మీ నిర్వాకం కారణంగా గ్రామస్తులు రహదారి హక్కు కోల్పోయారని మండిపడ్డారు. గోడను తొలగించడం ద్వారా పొనుగుపాడు గ్రామస్తుల హక్కును పునరుద్ధరించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.