తుగ్లక్ 2.0@100 రోజులు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై నారా లోకేశ్ సెటైర్లు!
- తుగ్లక్ పాలనలో ధర్నాచౌక్ ఫుల్ అయిపోయింది
- అభివృద్ధి సంక్షేమం నిల్ అయిపోయాయి
- కార్మికులకు తిండి, పని లేకుండా ఈ-కేవైసీ కోసం నిలబెట్టారు
ఇదంతా చేసి ఏమైనా సాధించారా? అంటే అదీ లేదని వ్యాఖ్యానించారు. ఉద్యోగులను రోడ్లపైకి ఈడ్చిపడేసిన ముఖ్యమంత్రి, తన నివాసం దగ్గర 144 సెక్షన్ పెట్టుకున్నారని లోకేశ్ విమర్శించారు. కార్మికులకు పని, తిండి లేకుండా చేసి ఈ-కేవైసీ లైన్లలో నిలబెట్టారని దుయ్యబట్టారు. ఈ మాత్రం దానికే 100 రోజుల పండుగ అంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దీనివల్ల ప్రజల సొమ్ము దండగ కావడం తప్ప ప్రయోజనమేదీ ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.