‘హెరిటేజ్’ కోసం ఏపీ డెయిరీని నాశనం చేసిన చరిత్ర చంద్రబాబుది!: విజయసాయిరెడ్డి
- కమీషన్లు దండుకున్న బతుకు ఆయనది
- జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు
- దీంతో బాబు కక్కలేక, మింగలేక ఇబ్బంది పడుతున్నారు
హెరిటేజ్ కోసం చంద్రబాబు ఏపీ డెయిరీని నాశనం చేశారని ఆరోపించారు. చంద్రబాబు 40 సంవత్సరాల పాటు తన కుటుంబం, సొంత మనుషుల కోసమే ఆరాటపడ్డారని దుయ్యబట్టారు. ఈ మేరకు ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి చంద్రబాబు, నారా లోకేశ్ లను ట్యాగ్ చేశారు.