ఎన్నికలప్పుడు గుర్తుకురాని టెక్నికల్ పాయింట్లు సీఎం జగన్ కు ఇప్పుడే గుర్తుకొస్తున్నాయా?: నారా లోకేశ్
- గోపాలమిత్రలు పాడిపరిశ్రమ అభివృద్ధికి సాయంచేశారు
- దశాబ్దాలుగా వాళ్ల సేవలను వినియోగించుకున్నారు
- ఇప్పుడు అర్హతలు లేవంటూ పక్కన పెట్టడం సరికాదు
దశాబ్దాలుగా వాళ్ళ సేవలను ఉపయోగించుకుని ఇప్పుడు అర్హతలు లేవంటూ వాళ్ళను పక్కనపెట్టడం సరికాదని హితవు పలికారు. ఏళ్ళ కొద్దీ సేవచేసినా వాళ్ళకు ఉద్యోగ భద్రత అనేది లేకపోతే ఎలా? అని నిలదీశారు. గోపాలమిత్రల సమస్యలను సీఎం జగన్ వెంటనే పరిష్కరించాలనీ, లేదంటే తన మాటలు, హామీలకు విశ్వసనీయత లేదని ముఖ్యమంత్రి ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్, ఓ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.