సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని ఇంత నీచప్రచారానికి దిగుతారా?: జగన్ పై లోకేశ్ ఫైర్
- రాష్ట్రంలో ఇసుక కొరతతో కార్మికులు రోడ్డున పడ్డారంటూ లోకేశ్ ఆవేదన
- పేదలకు అండగా టీడీపీ సాగిస్తున్న పోరాటాలను మార్ఫింగ్ కుట్రలతో పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆగ్రహం
- తుగ్లక్ కు జగన్ కు ఏమీ తేడాలేదంటూ వ్యంగ్యం
రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ ఇవాళ మంగళగిరిలో టీడీపీ ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ ధర్నాలో లోకేశ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో తుగ్లక్ పరిపాలన గురించి విన్నామని, ఇప్పుడది వైఎస్ జగన్ గారి రూపంలో ప్రత్యక్షంగా చూస్తున్నామని ఎద్దేవా చేశారు.