వైసీపీ నేతల శాడిజం అంతా సాక్షి పైశాచిక రాతల్లో కనిపిస్తోంది!: నారా లోకేశ్ ఆగ్రహం

  • చంద్రబాబు ఇంటిలోకి నీరొచ్చిందని రాశారు
  • దానికి ఔట్ హౌస్ ఫొటోను పెట్టారు
  • చంద్రబాబు లాంటి వ్యక్తి ఔట్ హౌస్ లో ఉంటారా?
వైసీపీ నేతలు, సాక్షి పత్రికపై తెలుగుదేశం నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నేతల శాడిజం అంతా సాక్షి పత్రిక పైశాచిక రాతల్లో కనిపిస్తోందని ఆయన విమర్శించారు. చంద్రబాబు గారి నివాసంలోకి వరద నీరు వచ్చిందని సాక్షి పత్రికలో కథనం రాశారనీ, దీనికి ఔట్ హౌస్ ఫొటోను పెట్టారని దుయ్యబట్టారు. హై సెక్యూరిటీ కలిగిన ఒక మాజీ ముఖ్యమంత్రి ఔట్ హౌస్ లోనే ఉంటారా? అని ప్రశ్నించారు. అయినా చంద్రబాబు గారి నివాసానికి, ఔట్ హౌస్ కు మధ్య ఎంత దూరం ఉందో చూడండి అంటూ ఓ ఫొటోను ట్విట్టర్ లో నారా లోకేశ్ పోస్ట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
SAKSHI
Nara Lokesh
Twitter
Telugudesam

More Telugu News