Ram: 25 రోజుల్లో 80 కోట్లు రాబట్టేసిన 'ఇస్మార్ట్ శంకర్'

షార్ట్స్‌లో చూడండి
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' మాస్ ఆడియన్స్ మనసులను దోచేసుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా తన జోరును చూపించింది. నభా నటేశ్ .. నిధి అగర్వాల్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, 25 రోజుల్లో 80 కోట్ల గ్రాస్ ను రాబట్టేసిందని చెబుతున్నారు.

రామ్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. రేపటి నుంచి కొత్త సినిమాల జోరు పెరగనుండటంతో, ఇక 'ఇస్మార్ట్ శంకర్' హవా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' భారీ లాభాలను తీసుకురావడంతో, పూరి - చార్మీ కలిసి విజయ్ దేవరకొండతో సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Ram
Nidhi
Nabha

More Telugu News