టీఆర్ఎస్ తో ఉంటే తెలంగాణ వాదులు, లేకపోతే ఆంధ్రా తొత్తులా?: మండిపడిన తెలంగాణ బీజేపీ చీఫ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఆర్ఎస్ తో ఉంటే తెలంగాణ వాదులు, లేకపోతే ఆంధ్రా తొత్తులా?: మండిపడిన తెలంగాణ బీజేపీ చీఫ్

  • బీజేపీపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారంటూ టీఆర్ఎస్ నేతలపై మండిపడిన లక్ష్మణ్
  • ఒవైసీ సోదరులతో భారత్ మాతా కీ జై అనిపించగలరా అంటూ సవాల్
  • కేటీఆర్ ఇకనైనా శ్రీరంగనీతులు చెప్పడం మానుకోవాలని హితవు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ టీఆర్ఎస్ పార్టీ నాయకులపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ తో ఉంటే తెలంగాణ వాదులు, లేకపోతే ఆంధ్రా తొత్తులు అంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 'బీజేపీపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న టీఆర్ఎస్ నేతలు ఒవైసీ బ్రదర్స్ తో భారత్ మాతా కీ జై అని అనిపించగలరా? అని లక్ష్మణ్ సవాల్ విసిరారు. అసలు, కేసీఆర్ కు మజ్లిస్ ను నియంత్రించగల ధైర్యం ఉందా? అంటూ ప్రశ్నించారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ కాంగ్రెస్ కు వీడ్కోలు పలికి బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇకనైనా శ్రీరంగనీతులు వల్లించడం మానుకోవాలని హితవు పలికారు.
BJP
Lakshman
TRS
KCR
KTR

More Telugu News