సినీ సంగీత కళాకారుల పరిస్థితి పట్ల చిరంజీవి ఆవేదన
- హైదరాబాద్ లో సినీ సంగీత కళాకారుల యూనియన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్
- ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి
- టెక్నాలజీ రాకతో సంగీత కళాకారులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయన్న మెగాస్టార్
అప్పట్లో ఆ విధమైన లైవ్ రికార్డింగులు చూడడం ఓ పండగలా ఉండేదని తెలిపారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ రాకతో లైవ్ రికార్డింగ్ లు తగ్గిపోయి, ఓ చిన్నగదిలో డిజిటల్ ఎక్విప్ మెంట్ సాయంతోనే మ్యూజికల్ ఎఫెక్ట్ లు సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ కారణంగా ఎంతోమంది సంగీత వాద్య కళాకారులు ఉపాధి లేక ఇతర రంగాలకు వలసపోతున్నారని చిరంజీవి బాధను వ్యక్తం చేశారు. అలాంటివాళ్లను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, తాను కూడా సాయం చేస్తానంటూ చిరు ముందుకు వచ్చారు.