తిరిగి హిందూ మతంలోకి వస్తే.. ఎస్సీ సర్టిఫికెట్‌కు అర్హులే: మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు
- క్రైస్తవం నుంచి హిందూమతంలోకి మారినవారికి ఎస్సీ సర్టిఫికెట్‌కు హక్కు
- జిల్లా విజిలెన్స్ కమిటీ ఉత్తర్వులను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు
- వ్యక్తి రూపం ఆధారంగా కులాన్ని నిర్ధారించడం తగదని వ్యాఖ్య
- కస్టమ్స్ రిటైర్డ్ అధికారి కేసులో కీలక తీర్పు
క్రైస్తవ మతం స్వీకరించి, తిరిగి హిందూ మతంలోకి వచ్చిన వ్యక్తికి షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) సర్టిఫికెట్ పొందే హక్కు ఉంటుందని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వ్యక్తి శారీరక రూపం, రంగు ఆధారంగా కులాన్ని నిర్ధారించడం సరికాదని స్పష్టం చేసింది. ఈ కేసులో పిటిషనర్ ఎస్సీ సర్టిఫికెట్ చెల్లదంటూ జిల్లా విజిలెన్స్ కమిటీ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.
తిరువణ్ణామలైకి చెందిన ఎస్. రవికుమార్, ఎస్సీ రిజర్వేషన్ కింద కస్టమ్స్ శాఖలో ఉద్యోగం సంపాదించి అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. ఈ ఏడాది మే నెలలో ఆయన పదవీ విరమణ చేసే సమయంలో కుల ధ్రువీకరణ పత్రంపై విచారణ జరిగింది. జిల్లా విజిలెన్స్ కమిటీ విచారణ జరిపి, రవికుమార్ మంచి ఛాయ, పొడవు, దృఢమైన శరీరం కలిగి ఉండటం, తమిళం, ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడటం వంటి కారణాలతో ఆయనను క్రైస్తవుడిగా నిర్ధారించింది. దీంతో ఆయన ఎస్సీ సర్టిఫికెట్ చెల్లదని ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులను రవికుమార్ హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. విజిలెన్స్ కమిటీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషనర్ హిందూ దేవుళ్లను పూజిస్తున్నాడా, హిందూ సమాజం అతడిని అంగీకరించిందా అనే అంశాలను పరిశీలించకుండా, కేవలం శారీరక రూపాన్ని బట్టి నిర్ణయానికి రావడం తగదని వ్యాఖ్యానించింది.
రవికుమార్ తండ్రి హిందూ ఆది ద్రావిడర్ కులానికి చెందినవారని, ఆయన 1960లో క్రైస్తవ మతంలోకి మారారని పిటిషన్‌లో పేర్కొన్నారు. 1966లో జన్మించిన రవికుమార్, తన తండ్రితో కలిసి 1983లో చెన్నైలోని ఆర్యసమాజ్ కేంద్రంలో తిరిగి హిందూ మతంలోకి మారి, హిందూ ఆచారాలనే పాటిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.