Baba Bhaskar: జీవితంలో నేను కోరుకున్నది ఒక్కటే .. అది నెరవేరింది: బాబా మాస్టర్

షార్ట్స్‌లో చూడండి
ఇటీవల కాలంలో తెలుగులో బాబా మాస్టర్ బాగా పాప్యులర్ అయ్యారు. తెలుగు .. తమిళ సినిమాలకి డాన్స్ మాస్టర్ గా పనిచేస్తోన్న ఆయన తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. "నేను పుట్టి పెరిగింది చెన్నైలో. మా నాన్న వార్డు కౌన్సిలర్ గా పనిచేసేవారు. ఇప్పుడు ఆయన లేరు.

నేను డాన్స్ మాస్టర్ గా ఎదిగి బెస్ట్ కొరియోగ్రఫర్ గా మా నాన్న చేతుల మీదుగా అవార్డు తీసుకోవాలనేది నా కోరిక. దాంతో శివశంకర్ మాస్టర్ .. రాజు సుందరం మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాను. డాన్స్ మాస్టర్ గా తొలిసారి ధనుశ్ సినిమా చేశాను. సూర్య హీరోగా చేసిన 'సింగం' సినిమాతో బెస్ట్ కొరియోగ్రఫర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. ఆ అవార్డును మా నాన్న చేతుల మీదుగా అందుకున్నాను. అలా నా కోరిక నెరవేరింది" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Baba Bhaskar
Ali

More Telugu News