ఏపీ ప్రభుత్వ వైఖరి వల్లే రుణం విషయంలో ప్రపంచబ్యాంకు వెనక్కి వెళ్లిపోయింది!: కన్నా లక్ష్మీనారాయణ
- జగన్ చెబుతున్నదానికి, చేస్తున్నదానికి సంబంధం లేదు
- కుల,మతాలకు అతీతంగా ప్రభుత్వం పాలన సాగించాలి
- కాకినాడలో మాట్లాడిన ఏపీ బీజేపీ చీఫ్
కాకినాడలో ఈరోజు జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడంతోనే రుణం విషయంలో ప్రపంచబ్యాంకు వెనక్కు తగ్గిందని కన్నా ఆరోపించారు. ఏపీ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను ఐదేళ్లలోనే పూర్తిచేశామని స్పష్టం చేశారు.