Divyavani: వైసీపీకి 175 సీట్లు వచ్చుంటే చాలా ఆనందించేదాన్ని: నటి దివ్యవాణి సంచలన వ్యాఖ్య

షార్ట్స్‌లో చూడండి
తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టలో చేరనున్నట్టు వస్తున్న వార్తలపై నటి, టీడీపీ ప్రతినిధి దివ్యవాణి స్పందించారు. తాను తెలుగుదేశం పార్టీని వీడబోనని అన్నారు. డబ్బు కోసమో, పదవి కోసమో తాను వైసీపీలో చేరబోనని చెప్పారు.

శాసనసభ ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లూ వచ్చుంటే తాను ఇంకా ఆనందించేదాన్నని, అప్పుడైనా చంద్రబాబునాయుడికి తన కుటుంబ సభ్యులతో గడిపేందుకు కాస్తంత సమయం లభించేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముద్దులొలికే మనవడితో గడిపేవారని అన్నారు. తెలుగుదేశం పార్టీలో తాను ఇమడలేనని అనిపించిన నాడు, అధినేత చంద్రబాబుకు చెప్పిన తరువాతే పార్టీకి రాజీనామా చేస్తానని అన్నారు. ఏపీ ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. తనను వైసీపీ నుంచి ఎంతో మంది పిలిచారని, తాను డబ్బుకు ఆశపడే అమ్మాయిని కాదని అన్నారు.

తాను ఎన్నడూ జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయని చెప్పలేదని దివ్యవాణి స్పష్టం చేశారు. తాను పవన్ పై ఎన్నడూ విమర్శలు మాత్రం చేయలేదని అన్నారు. జనసేనతో కలిసి పనిచేయాల్సిన అవసరం టీడీపీకి లేదని చెప్పారు.
Go Back to Shorts
Divyavani
Chandrababu
YSRCP

More Telugu News