జగన్ గెలుపు విషయం టాలీవుడ్ పెద్దలకు వినిపించలేదా? కనిపించలేదా?: హాస్య నటుడు నటుడు పృథ్వీ ఫైర్

  • టాలీవుడ్ పెద్దలు ఏమయ్యారు 
  • గతంలో చంద్రబాబును అభినందించారే
  •  వీళ్లెవరికీ జగన్ గెలుపు తెలియదా?
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో విజయాన్ని సాధించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి జగన్ సిద్ధమవుతున్నాడు. అయితే ఈ విషయంపై టాలీవుడ్ పెద్దలు అంతగా స్పందించడంగానీ .. ఆసక్తిని చూపడంగాని చేయకపోవడం పట్ల కమెడియన్ పృథ్వీ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశాడు.

"తెలుగు సినీ అనుకూల పెద్దలారా .. ఏదైతే జరగకూడదని అనుకున్నారో అదే జరిగే సరికి నోరు పెగలడం లేదా? జగన్ ను అభినందించడానికి పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ రాయలేకపోతున్నారా? గతంలో చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు ఉదయం ఫ్లైట్ కి వెళ్లి అభినందించి సాయంత్రం ఫ్లైట్ కి తిరిగొచ్చేసిన టాలీవుడ్ పెద్దలు చాలా మందే వున్నారు. వాళ్లంతా జగన్ విషయంలో ఎందుకు సైలెంట్ అయ్యారు? జగన్ గెలుపు వాళ్లకి వినిపించలేదా? కనిపించలేదా? జగన్ అత్యధిక మెజారిటీతో గెలిచిన విషయం, రాఘవేంద్రరావు .. అల్లు అరవింద్ .. దగ్గుబాటి సురేశ్ బాబు .. చిరంజీవి చెవిన ఎవరూ వేయలేదేమో?!" అంటూ సెటైర్లు వేశాడు.
pruthvi

More Telugu News