మళ్లీ ఒక్కటైన శింబు - హన్సిక
- హన్సిక 50వ చిత్రంగా 'మహా'
- ప్రత్యేకమైన పాత్రలో శింబు
- తొలగిపోయిన మనస్పర్థలు
హన్సిక 50వ చిత్రంగా, జమీల్ దర్శకత్వంలో 'మహా' రూపొందుతోంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో శింబు కనిపించనున్నట్టు సమాచారం. ఆయన పేరును హన్సికనే సూచించిందనీ, ఆమె రిక్వెస్ట్ చేయడం వల్లనే శింబు ఓకే అన్నాడని దర్శకుడే స్వయంగా చెప్పాడు. ఈ సినిమాతో తాము మళ్లీ కలిసిపోయినట్టుగా హన్సిక కూడా స్పందించింది. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్లో కొన్ని రొమాంటిక్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. విడిపోయిన జంట .. కలిసి తెరపై కనిపించనుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.