అంజలి హారర్ థ్రిల్లర్ చిత్రంగా 'లిసా' .. విడుదల తేదీ ఖరారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంజలి హారర్ థ్రిల్లర్ చిత్రంగా 'లిసా' .. విడుదల తేదీ ఖరారు

  • అంజలి ప్రధాన పాత్రధారిగా 'లిసా'
  • హారర్ నేపథ్యంలో సాగే కథ
  • ఈ నెల 24వ తేదీన విడుదల         
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా అంజలికి మంచి క్రేజ్ వుంది. నాయిక ప్రాధాన్యత కలిగిన కథల్లో మెప్పించడం కూడా అంజలికి అలవాటే. ఇక హారర్ థ్రిల్లర్ చిత్రాల ద్వారా కూడా తన నటనలో మరో కోణాన్ని అంజలి ఆవిష్కరించింది. అలా తెలుగులో ఆమె చేసిన 'గీతాంజలి' భారీ విజయాన్ని అందుకుంది.

తాజాగా ఆమె 'లిసా' అనే మరో హారర్ థ్రిల్లర్ సినిమా  చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ సినిమా, ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు .. తమిళ భాషల్లో ఇదే రోజున ఈ సినిమా విడుదల కానుంది. రాజు విశ్వనాథం దర్శకత్వం వహించిన ఈ సినిమా, తనకి తప్పకుండా మరో హిట్ ఇస్తుందనే నమ్మకంతో అంజలి వుంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. 
anjali

More Telugu News